హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులతో రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారుల బృందం భేటీ ముగిసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎదుట నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌తో పాటు మరో ఇద్దరు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరై వివరణ ఇచ్చారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ వద్ద వెల్లడించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటి తరలింపు సామర్థ్యం పెంచుతూ ఇచ్చిన జీవోపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం... కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 203పై వివరణ కోరుతూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఇటీవల లేఖ రాసింది.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'