AP HC ON MLC DRIVER MURDER CASE: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. సీసీ ఫుటేజ్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను 15 రోజుల్లో తీసుకోవాలని ఆదేశించింది. నివేదిక పరిశీలించి హత్యలో వ్యక్తుల పాత్ర నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో గుర్తించిన అంశాలతో అదనపు అభియోగపత్రం వేయాలని హైకోర్టు సూచించింది. 3 నెలల్లోగా తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతేడాది ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఇదీ జరిగింది: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ.. ఈనెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్ ఫోన్ చేసి .. నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు.
MLC DRIVER MURDER CASE UPDATES: మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చారు. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమానాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు.
AP HIGH COURT ON MLC ANANTHABABU: పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి హత్య కేసుగా మార్చారు. మే 23న ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేసిన పోలీసులు.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి అనంతబాబును తరలించారు.
ఇవీ చదవండి: