ఏపీకి చెందిన విశాఖ వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం... మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశాల్లో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31లోగా సీబీఐ తన నివేదిక అందించాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఏప్రిల్ తొలి వారానికి వాయిదా వేసింది.