AP Health Department: మానసిక సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాలలో టెలీమానస్ కేంద్రాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది. మానసిక సమస్యల కోసం 14416 లేదా 180089114416 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి టెలీ కౌన్సెలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ టెలీ మానస్ కేంద్రం ద్వారా సేవలు అందుతాయని వెల్లడించింది. మానసిక సమస్యలు ఉన్న వారికి టెలిఫోన్ కౌన్సెలింగ్ ద్వారా సూచనలు, సలహాలు అందించనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం ఏపీ జనాభాలో 10 శాతం మంది ప్రజలు మానసిక ఒత్తిళ్లు, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తేలిందని స్పష్టం చేసింది. ఆర్థిక, సామాజిక సమస్యలు, పరీక్షలు, ఉద్యోగాన్వేషణలో తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా.. అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయని స్ఫష్టం చేసింది. అయితే ఈ తరహా ఒత్తిళ్లు 90 శాతం మానసిక రుగ్మతల్ని కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించి ఆత్మహత్యల్ని నివారించే అవకాశం ఉందని తెలిపింది. అందుకే మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు టెలీ మానస్‌ను సంప్రదించాలని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: