ETV Bharat / state

AP GOVERNMENT: 'తెలంగాణ ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చండి'

author img

By

Published : Oct 6, 2021, 8:49 AM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. తెలంగాణలో నిర్మాణం పూర్తై ఉన్న ఏడు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోనికి తీసుకురావాలని అందులో పేర్కొంది.

AP GOVERNMENT
తెలంగాణ ప్రాజెక్టులు

తెలంగాణలో నిర్మాణం పూర్తై నిర్వహణలో ఉన్న ఏడు ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అందజేసినందున.. ఈ పథకాన్ని నోటిఫికేషన్‌లోని ప్రాజెక్టుల షెడ్యూలులో చేర్చాలని అభ్యర్ధించింది. త్వరలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులోకి రానుండగా.. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు కేంద్రజల్‌శక్తి శాఖ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు.

పునర్విభజన చట్టంలోని.. 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులను.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాలని పేర్కొనగా.. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని లేఖలో గుర్తుచేశారు. ఈ మేరకు గెజిట్‌లో.. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మార్పు చేయాలని కోరారు. తెలంగాణలో.. నిర్మాణం పూర్తయి నిర్వహణలో ఉన్న శ్రీరామసాగర్‌ మొదటిదశ.. రెండోదశ, ఎల్లంపల్లి, ఆమోదం లేని ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీకి నీటిని మళ్లించే పథకం.. మంథని, ఎల్లంపల్లి, కడెం ఎత్తిపోతలను.. గెజిట్‌ నోటిఫికేషన్‌లో చేర్చాలని అభ్యర్ధించారు.

ఇదీ చదవండి: KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'

Water dispute between Telangana and AP : తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.