ETV Bharat / state

'ఎన్నికల విధుల్లో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి' - supreme court on ap local polls

సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సహకరిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. సుప్రీంలో తమకు న్యాయం జరగలేదన్న ఆయన.. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా... కరోనాతో ఉద్యోగి మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.

'ఎన్నికల విధుల్లో.. కరోనాతో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి'

author img

By

Published : Jan 26, 2021, 9:03 PM IST

ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని తామెక్కడా చెప్పలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని చెప్పారు. తమ వాదనలు వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందన్నారు. తమకు న్యాయం జరగలేదన్న ఆయన.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. సీఎస్‌ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంటామని తెలిపారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఎన్నికల విధుల్లో కరోనాతో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులతో వైరం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనే మమ్మల్ని వివాదంలోకి లాగిందని.. ఆ తరువాతే తాము మాట్లాడామని వివరించారు. ఉద్యోగ సంఘాలపై కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.