ETV Bharat / state

Krishna Water War: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల

author img

By

Published : Jul 13, 2021, 8:58 PM IST

కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సజ్జల స్పష్టం చేశారు.

sajjalla
సజ్జల రామకృష్ణారెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని తెలిపారు. వర్షాలు సకాలంలో కురవకపోతే.. నీరు లభ్యం కాక రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం జరుగుతుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సజ్జల స్పష్టం చేశారు. నీటి వివాదంపై రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని పలువురు సూచిస్తున్నారని.. అలా మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైనా ముందుకు రావాలిగా అని అన్నారు.

ఆర్థిక శాఖకు సంబంధించి ఖర్చులను తాము ఎక్కడా దాచడం లేదన్న సజ్జల.. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు రుణ పరిమితిలో కేంద్రం కోత విధించిందన్నారు. కొవిడ్ ఆర్థిక కష్టాలున్నా.. పంటిబిగువన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు. రేపు లేదా ఎల్లుడి నామినేటెడ్ పదవులు ప్రకటిస్తామని సజ్జల వెల్లడించారు. పదవుల్లో 50 శాతం మహిళలు, 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం కల్పిస్తామన్నారు.

ఇదీ చదవండి: CABINET MEET: కేబినెట్​ భేటీ.. 50 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.