ETV Bharat / state

YSR Rythu Bharosa: ఏపీలో నేడు 'వైఎస్సార్​ రైతు భరోసా- పీఎం కిసాన్'​ నిధుల విడుదల

YSR Rythu Bharosa-PM Kisan-Founds: ఏపీలో నేడు వైఎస్సార్​ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను ఆ రాష్ట్ర సీఎం జగన్‌.. విడుదల చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రూ. 1,036 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.

YSR Rythu Bharosa
YSR Rythu Bharosa
author img

By

Published : Jan 3, 2022, 5:44 AM IST

YSR Rythu Bharosa-PM Kisan-Founds Released: వైఎస్సార్​ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను ఏపీ సీఎం జగన్‌ నేడు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 50.58 లక్షల మంది రైతులకు..1036 కోట్లను సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో నేడు జరిగే కార్యక్రమంలో జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది.​

'రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం.. రూ. 13,500 అందిస్తోంది. తొలివిడతగా పంట వేసేముందు మే నెలలో 7,500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడుతగా సంక్రాంతికి రూ.2వేలు ఇస్తున్నాం. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందించాం' అని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చూడండి: Rythu bandhu Celebrations: రాష్ట్రంలో ముందే సంక్రాంతి.. రేపట్నుంచి రైతుబంధు సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.