కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. అక్టోబర్ ఆరో తేదీన జరిగిన రెండో అత్యున్నత మండలి సమావేశం నిర్ణయానికి అనుగుణంగా.. విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయం కోసం వసతి చూడాలని ఏపీ జలవనరుల శాఖ ఇప్పటికే ఈఎన్సీనీ ఆదేశించినట్లు తెలిపింది. వసతి గుర్తింపు పూర్తయ్యాక బోర్డుకు సమాచారం ఇస్తామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.