గడిచిన 24 గంటల్లో ఏపీలో 51,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 289 మందికి మహమ్మారి సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 428 మంది కోలుకోగా.. కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మరణించారని వెల్లడించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 42 మందికి.. ప్రకాశంలో అత్యల్పంగా ఇద్దరికి కొత్తగా కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందని పేర్కొంది. చిత్తూరు విశాఖ జిల్లాల్లో 40, తూర్పుగోదావరిలో 39, పశ్చిమగోదావరిలో 33, కృష్ణాలో 27, నెల్లూరులో 16, అనంతపురంలో 15, కడపలో 11, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 8, కర్నూలులో ఏడుగురికి వైరస్ బారిన పడ్డారని తెలిపింది.
తాజా గణాంకాలతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు 8,83,876 మందికి కరోనా సోకగా.. 8,73,855 మంది కోలుకున్నారు. మరో 2896 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,125 మందికి వైరస్ ధాటికి మరణించారు.