ETV Bharat / state

ఏడాదిలో సంక్షేమం కోసం రూ.43వేల కోట్లు ఖర్చు: జగన్ - వైఎస్​ఆర్ నేతన్న నేస్తం పథకం వార్తలు

'వైఎస్సార్ నేతన్న నేస్తం' రెండో విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. కొవిడ్‌ ప్రభావంతో ఈ విడత సాయాన్ని ఆరు నెలల ముందుగానే అందిస్తున్నారు. లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా సొమ్ము జమ చేశారు. ప్రతి పేదవాడి బాగు కోసం 13 నెలల వైకాపా పాలనలో 43వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జగన్​ తెలిపారు.

ap-cm-jagan-launches-ysr-nethanna-nestham-second-phase-for-weavers
ఏడాదిలో సంక్షేమం కోసం రూ.43వేల కోట్లు ఖర్చు :జగన్
author img

By

Published : Jun 20, 2020, 2:27 PM IST

'వైఎస్సార్ నేతన్న నేస్తం' రెండో విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో తొలి విడత ఆర్థికసాయాన్ని అందించగా... కొవిడ్‌ ప్రభావంతో ఈ విడత సాయాన్ని ఆరు నెలల ముందుగానే అందిస్తున్నారు. లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా సొమ్ము జమ చేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. చేనేతలకు మంచి జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు. గతేడాది లబ్ధిదారులకు నేరుగా డబ్బులు జమ చేశామన్న ఆయన...కరోనా కష్టాలు ఉన్నందున్న ఆరు నెలల్లో మరోసారి సాయం అందిస్తున్నామని తెలిపారు. గత తెదేపా ప్రభుత్వం హయంలో చేనేత కుటుంబాలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ 2 నుంచి ఈ- ప్లాట్‌ ఫాం అందుబాటులోకి వస్తుందని, నాణ్యత, రవాణా, నగదు చెల్లింపు అంశాలపై కార్మికులు ప్రధానంగా దృష్టిసారించాలని ఏపీ సీఎం సూచించారు.

నేత కుటుంబాలను ఆదుకునేందుకే ఆరు నెలల ముందు సాయం అందిస్తున్నాం. కరోనాతో చేనేత కుటుంబాలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయి. అందుకే రెండో విడత కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించాం. ఐదేళ్ల తెదేపా ప్రభుత్వంలో చేనేతలపై ఖర్చు చేసింది కేవలం రూ.200 కోట్లే. కానీ వైకాపా పాలనలో గతేడాది 200కోట్లు ఇస్తే..రెండో విడతలో 400కోట్లు విడుదల చేస్తున్నాం. చేనేతలకు లబ్ధి చేకూర్చేలా అప్కో ద్వారా అనేక చర్యలు చేపడుతున్నాం. మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. ఈ 13 నెలల వైకాపా పాలనలో వివిధ సంక్షేమ పథకాల కోసం 43వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.ఈ డబ్బులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం. - ఏపీ సీఎం జగన్

పథకాన్ని ప్రారంభించిన అనంతరం జగన్...వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఒక 'ధూర్త శక్తి''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.