ETV Bharat / state

AP CM JAGAN: దానితో నాకు సంబంధం లేదు.. నా పేరు తొలగించండి - ap cm jagan case

హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్‌ కేసులో 94 మంది వ్యక్తుల సాక్ష్యాల్లో... ఏ ఒక్కరూ తనపై ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. అందుకే ఐపీసీ సెక్షన్‌ 420 తనకు వర్తించదని... పెన్నా కేసు నుంచి తన పేరును తొలగించాలని నివేదించారు. అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది.

AP CM JAGAN
సీఎం జగన్ డిశ్ఛార్జ్ పిటిషన్
author img

By

Published : Jul 14, 2021, 7:32 AM IST

అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా సీబీఐ నమోదు చేసిన పెన్నా సిమెంట్స్‌ కేసులో తాను నేరం చేసినట్లు ఏ ఒక్క ఆధారమూ లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM JAGAN) సీబీఐ కోర్టుకు నివేదించారు. పెన్నా కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన మంగళవారం డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మీద కక్షతో తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. 94 మంది సాక్షుల నుంచి సీబీఐ వాంగ్మూలాలు సేకరించిందని, ఏ ఒక్కరూ తనపై ఆరోపణలు చేయలేదన్నారు. తాను ఏ ఒక్కరి నుంచీ లబ్ధి పొందినట్లు ఆధారాలు లేవని తెలిపారు. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేసినట్లు కూడా ఆధారాలు లేవన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, ఐపీసీ సెక్షన్‌ 420 వర్తించదని చెప్పారు. పెన్నా సిమెంట్స్‌కు భూకేటాయింపులపై ఎమ్మార్వో నుంచి ప్రతిపాదనలు జిల్లా రెవెన్యూ అధికారికి, అక్కడి నుంచి ఆ ఫైలు సీసీఎల్‌ఏకు, ఎంపవర్డ్‌ కమిటీ ముందుకు... అనంతరం ముఖ్యకార్యదర్శి, మంత్రి తరువాత మంత్రిమండలి ముందుకు వెళ్లిందన్నారు. మంత్రిమండలి ఆమోదంతోనే భూకేటాయింపు జరిగిందన్నారు.

వాటికి ఆధారాలు లేవు

నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించాలని నాటి సీఎం రాజశేఖరరెడ్డి ఆదేశాలు జారీ చేశారనేందుకు ఆధారాలు లేవని తెలిపారు. అల్ట్రాటెక్‌కు లీజు రద్దుచేసి పెన్నాకు కేటాయించారన్న దానిలో వాస్తవం లేదని, ఆ కంపెనీ ప్రతినిధి పార్థసారథి మజుందార్‌ ఇచ్చిన ప్రకటనలో మైనింగ్‌ లీజును ఉపసంహరించుకున్నట్లు చెప్పారన్నారు. తాండూరు సిమెంట్స్‌కు కేటాయించిన లీజులు పెన్నా తాండూరుకు కేటాయించడంలోనూ నిబంధనలు పాటించినట్లు అధికారి వాంగ్మూలం ఇచ్చారన్నారు.

అభియోగాలు మోపడం సరికాదు

పయనీర్‌ హోటల్‌కు రాయితీలు గతంలో బ్లిట్జ్‌ హోటల్‌కు ఇచ్చినట్లే కల్పించారన్నారు. ఆధారాలు లేకుండా అభియోగాలు నమోదు చేయడం సరికాదని, కేసును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌తో పాటు ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లోనూ కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ కోర్టు విచారణను 22కు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో నిందితుడైన శామ్యూల్‌ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.

'జగన్​ బెయిల్​ రద్దు చేయండి'

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని.. పిటిషన్​లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని... కోర్టును కోరింది. జగన్ వాదనలపై సమాధానాలు ఇచ్చేందుకు రఘురామ కృష్ణ రాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో నేటికి వాయిదా పడింది. పిటిషన్​పై ఇవాళ వాదనలు ముగిసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి.. సీబీఐ కోర్టులో జగన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.