హీరోయిన్ అనుష్క ఏపీలోని గుంటూరు జిల్లా పంటపొలాల్లో కనపడుతోంది. కొంపదీసి వ్యవసాయం చేస్తుందనుకునేరు. ఫ్లెక్సీల రూపంలో పంటకు దిష్టి తలక్కుండా కాపలకాస్తోంది. పెదలంక గ్రామానికి చెందిన ఓ రైతు... ఆ ఫొటోల కింద తనదైన రీతిలో డైలాగ్స్ రాయించి చూపరుల్నీ ఆశ్చర్య పరిచాడు. 'ఏడవకురా..అప్పుచేసి వేశాను..'అంటూ హస్యస్పదంగా ప్రింట్ చేయించాడు. అదేంటని ప్రశ్నిస్తే 'ఆమెవరో కూడా తెలీదు..దారిలో పోయే వాళ్లు ఆ ఫ్లెక్సినే చూస్తారు కదా..దొండసాగుకు దిష్టి తలగదు..'అంటూ అమాయకంగా సమాధానమిస్తున్నాడు. బెల్లంకొండ మండలం వెంకటపాలెంలోనూ.. ఓ రైతు ఇలాగే పత్తిపంటలో సినీనటి చిత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇదీ ఓ రకం రక్షణే మరి..!
ఇవీ చదవండి..'నిశ్శబ్దం'గా షూటింగ్ ముగించిన అనుష్క