మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న మరో ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫేవిఫిరావిర్ ట్యాబ్లెట్లతోపాటు రెమ్ డెస్విర్ ఇంజెక్షన్స్ ను ఎక్కువ ధరకు అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. మార్కెట్లో రూ. 5,500 ధర ఉన్న రెమ్ డెస్విర్ ఇంజెక్షన్స్ ను నిందితులు రూ. 30వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.