ETV Bharat / state

దోమలపై బల్దియా డ్రోన్​ యుద్ధం

హైదరాబాద్​లో కరోనా వైరస్​, సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గ్రేటర్​ పరిధిలోని అన్ని చెరువుల్లో డ్రోన్లను ఉపయోగించి యాంటీ లార్వా పిచికారీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే గుర్రపు డెక్కలను కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Anti-larvae spray using drones in all ponds of Greater Hyderabad
దోమలపై బల్దియా డ్రోన్​ యుద్ధం
author img

By

Published : Jul 7, 2020, 8:19 PM IST

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని చెరువుల్లో డ్రోన్లను ఉపయోగించి యాంటీ లార్వా పిచికారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంట‌మాల‌జిస్ట్ రాంబాబు తెలిపారు. ప్రతి చెరువులో డ్రోన్ల ద్వారా వారానికోసారి ఈ ఆప‌రేష‌న్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం న‌గ‌రంలో 5 డ్రోన్ల ద్వారా ఖైర‌తాబాద్, సికింద్రాబాద్‌, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, ఎల్బీన‌గ‌ర్ జోన్ల‌లో చేస్తున్నట్లు వివరించారు.

ఈ జోన్లలో మొత్తం 54 మందిని నియమించారని పేర్కొన్నారు. మూసీ నదిలో కూడా ఈ ప్రక్రియను కొనసాగించనున్నట్లు తెలిపారు. మ‌రో 11 డ్రోన్ల ద్వారా మిగిలిన జోన్ల‌లో కూడా దోమ‌ల నివార‌ణ‌కు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టెండ‌ర్ల ద్వారా గుర్రపుడెక్క తొల‌గించ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.