Cyberabad cp: హైదరాబాద్‌లో కొంత మంది యువత ఆనందం కోసం మత్తుపదార్థాలను ఎంచుకుంటున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని సీపీ తెలిపారు.
మాదక ద్రవ్యాలకు, నేరాలకు విడదీయరాని సంబంధం ఉందని.. మత్తు పదార్థాలకు బానిసలైన వారు నేరాలు చేయడానికి వెనకాడటం లేదని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. 10ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలోని పశ్చిమ మండల డీసీపీగా ఉన్నప్పుడు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలో మత్తు పదార్థాల సరఫరా జరుగుతోందని దీన్ని అరికట్టాలని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల నివారణ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: RACHAKONDA CP: సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ టీమ్‌ల సేవలు అభినందనీయం: మహేశ్ భగవత్