సికింద్రాబాద్‌లో కొత్త ఆలోచనలతో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కలిసి ఓ రెస్టారెంట్ను ప్రారంభించారు. తమ పేరులోని మొదటి అక్షరాన్ని కలిపి రెస్టారెంట్ పేరుగా మార్చుకున్నారు. సరికొత్త హంగులతో,నోరూరించే శాకాహార, మాంసాహార రుచులతో తిరుమలగిరి ఆర్టీవో ఆఫీస్ ఎదుట ఏఎన్ఆర్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భోజనశాలను ప్రారంభించారు. రెస్టారెంట్ అద్భుతంగా ఉందని.. అందరికీ అందుబాటులో ఉన్న ఈ రెస్టారెంట్లో ప్రతి ఒక్కరూ రుచి చూడాలని మంత్రి అన్నారు. ఎన్నో రకరకాల రెస్టారెంట్లు, హోటళ్లు వచ్చినప్పటికీ సికింద్రాబాద్ తిరుమలగిరిలో నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్‌తో కూడిన చైనీస్ వంటకాలను మేళవించిన మొదటి రెస్టారెంట్ ఏఎన్ఆరే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధరలు అందరికీ అందుబాటులోనే నిర్ణయించినట్లు నిర్వహకులు తెలిపారు.
ఇవీ చూడండి : ఖైరతాబాద్ గణేశ్ మండపాన్ని సందర్శించిన మంత్రి తలసాని