ETV Bharat / state

ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి - జహీరాబాద్ నిమ్జ్​లో ట్రైటాన్​ పరిశ్రమ

electronic vehicles
electronic vehicles
author img

By

Published : Jun 24, 2021, 5:58 PM IST

Updated : Jun 24, 2021, 7:35 PM IST

17:55 June 24

ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ట్రైటాన్(triton) ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఇవాళ.. అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సూమారు రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.  

ప్రగతి భవన్​లో ఇవాళ జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో సమావేశమై.. తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్​కు ట్రైటాన్ ఈవీకు తెలిపింది.  

భారత్​లో తయారీ ప్లాంట్​ని ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో హిమాన్షు పటేల్... కేటీఆర్​కు తెలిపారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్​లో తయారీ యూనిట్​ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.  

ఇదీచూడండి: ఈ రాత్రికి చంద్రుడు ఎంత ప్రత్యేకంగా కనిపిస్తాడో తెలుసా?

Last Updated : Jun 24, 2021, 7:35 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.