ETV Bharat / state

సచివాలయంలో మరో కరోనా కేసు - telangana secretariat employee corona

corona
corona
author img

By

Published : Jun 14, 2020, 10:55 AM IST

Updated : Jun 14, 2020, 12:26 PM IST

10:54 June 14

సచివాలయంలో మరో కరోనా కేసు

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో  మరొకరికి కరోనా సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్​ నిర్ధరణ అయింది. గత ఐదు రోజులుగా సదరు ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో బీఆర్కే భవన్​లో ఐటీ విభాగం ఉన్న రెండో అంతస్తులో కలవరం మొదలైంది. 

ఇప్పటికే ఆర్థిక శాఖలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆ శాఖలోని ఉద్యోగులు ఎవరూ విధుల్లోకి రావడం లేదు. బీఆర్కే భవన్​లోకి సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చే వారైతే సంబంధిత అధికారుల అనుమతితోనే లోపలికి పంపిస్తున్నారు. అధికారులు కూడా వీలైనంత మేరకు ఎవరికీ అపాయింట్​మెంట్లు ఇవ్వడం లేదు.  

Last Updated : Jun 14, 2020, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.