Rapolu Ananda Bhaskar will join TRS: మునుగోడు ఉపఎన్నికల ముందు భాజపా నేతలకు మరో షాక్ తగిలింది. గులాబీ పార్టీ నుంచి భాజపా నుంచి మరో నేత కారెక్కనున్నారు. భాజపా నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెరాసలో చేరనున్నారు. ఈ మేరకు నిన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆనంద భాస్కర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజరపా ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం పట్ల ఆనంద భాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని భాజపా నిర్వీర్యం చేస్తోందనన్న ఆయన.. ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని, భాజపాకు రాజీనామా చేసి తెరాసలో చేరుతానని కేసీఆర్ వద్ద చెప్పారు.
ఇప్పటికే గులాబీ అపరేషన్ ఆకర్ష్‌తో బిక్షమయ్యగౌడ్ కమలంపార్టీని వీడడంతో భాజపా ఉక్కిరిబిక్కిరి కాగా.. ఆ షాక్ నుంచి తేరుకోకముందే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కమలం విడిచిపెట్టి గులాబీని పట్టారు. తాజాగా రాపోలు రాకతో గులాబీ శ్రేణుల్లో ఉత్సహం రాగా కమలం పార్టీకి మునుగోడు ఉపఎన్నికల వేళ ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
ఇవీ చదవండి: