రాష్ట్రంలో మరో 2,751 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కేసులతో బాధితుల సంఖ్య 1,20,166కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 808 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
24 గంటల వ్యవధిలో 62,300 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. కరోనా నుంచి మరో 1,675 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 89,350 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,008 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 432 మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలో 192, రంగారెడ్డి జిల్లాలో 185, నల్గొండ జిల్లాలో 147, ఖమ్మం జిల్లాలో 132, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 128, నిజామాబాద్ జిల్లాలో 113, సూర్యాపేట జిల్లాలో 111, వరంగల్ అర్బన్ జిల్లాలో 101, పెద్దపల్లి జిల్లాలో 97, సిద్దిపేట జిల్లాలో 96, జగిత్యాల జిల్లాలో 88, మంచిర్యాల జిల్లాలో 86, మహబూబాబాద్ జిల్లాలో 75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 72, కామారెడ్డి జిల్లాలో 65, మహబూబ్‌నగర్ 64, వనపర్తి జిల్లాలో 63, యాదాద్రి భువనగిరి జిల్లాలో 58, నాగర్‌కర్నూల్ జిల్లాలో 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.03 శాతంగా ఉంది.