ETV Bharat / state

Kgbv: కొత్తగా 20 కేజీబీవీలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల ప్రారంభం

Kgbv: రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Kgbv
Kgbv
author img

By

Published : May 10, 2022, 7:08 AM IST

Kgbv: రాష్ట్రంలో కొత్తగా వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. కేంద్రం మాత్రం 20 మంజూరు చేసేందుకు అంగీకరించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిలో 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. వీటిని తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడుపుతారు. శాశ్వత భవనాలు వస్తే మిగిలిన తరగతులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 చోట్ల ఇంటర్‌ వరకు విద్య అందిస్తుండగా మిగిలిన వాటిల్లో 6-10 తరగతుల వరకు బోధిస్తున్నారు. తాజాగా మరో 37 కేజీబీవీలను ఇంటర్‌ వరకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించడంతో అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలను ఆదేశించింది. దీంతో కొత్తగా 2,590 ఇంటర్‌సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇవీ చూడండి:

పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్​

పోలీస్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసులో బాంబు పేలుడు.. వారి పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.