ETV Bharat / state

ACB Annual Crime Report AP: అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం

ACB Annual Crime Report- 2021 of AP:ఆంధ్రప్రదేశ్​లో అవినీతిలో రెవెన్యూ శాఖ(ACB) ఏటికేడు తగ్గేదేలే అంటోంది. ఈ ఏడాదీ రెవెన్యూ శాఖదే అవినీతిలో అగ్రస్థానమని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. వార్షిక నివేదిక విడుదల చేసిన అనిశా...ఇంధన, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లోనూ కోట్లకొద్దీ పోగేసిన లంచగొండులు ఎక్కువ మందే ఉన్నారని నివేదించింది.

author img

By

Published : Dec 31, 2021, 7:03 AM IST

ACB Annual Crime Report
ACB Annual Crime Report
అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం

ACB Annual Crime Report-2021 AP: ఆంధ్రప్రదేశ్​లో లంచం తీసుకుంటూ అవినీతినిరోధక శాఖకు దొరికిన ప్రభుత్వోద్యోగుల్లో సగంమందికిపైగా రెవెన్యూ శాఖలో పనిచేసేవారే ఉన్నారని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. 2021లో మొత్తం 72 ట్రాప్ కేసులు నమోదవగా.. అందులో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు. లంచం తీసుకుంటూ దొరికిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్, హోం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. మొత్తం ట్రాప్ కేసుల్లో 86.11 శాతం అంటే 62 కేసులు ఈ 5 శాఖల ఉద్యోగులపైనే నమోదయ్యాయి. ఈ ఏడాది లెక్కల్లో అత్యధికంగా విశాఖ జిల్లా చోడవరం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన రవికుమార్.. రూ. 4 లక్షల 50 వేల తీసుకుంటూ అ.ని.శా.కు చిక్కారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తహసీల్దార్ నాగభూషణరావు.. రూ.4 లక్షలతో కంట పడ్డారు. భూముల మ్యుటేషన్, పొసెషన్ సర్టిఫికెట్, ఆన్‌లైన్‌లో భూముల వివరాల నమోదుకు రెవెన్యూ ఉద్యోగులు లంచాలు తీసుకున్నారు.

అత్యధికంగా ఆదాయానికి మించిన ఆస్తులు

ఈ ఏడాది నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో...అత్యధికంగా బీసీసంక్షేమశాఖ కార్పొరేషన్ ఎండీ నాగభూషణం దగ్గర.. రూ.10 కోట్ల 79 లక్షల విలువజేసే ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. ఏపీఈపీడీసీఎల్​(APEPDCL) ఏఈ నాగేశ్వరరావు వద్ద రూ. 3 కోట్ల 82 లక్షల విలువైన అక్రమాస్తులు ఉన్నాయని తేల్చారు.

ఈ ఏడాది అందిన ఫిర్యాదులు

లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వోద్యోగులకు సంబంధించి...మొత్తం 72 కేసులు నమోదవగా....వారు లంచంగా తీసుకుంటున్న రూ. 32 లక్షల 40 వేలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఈ ఏడాది 2,851 ఫిర్యాదులు అందాయని నివేదికలో ప్రస్తావించారు. వాటి ఆధారంగా 8 ట్రాప్ కేసులు, 16 రెగ్యులర్ విచారణలు చేపట్టారు. ఇక అనిశా నమోదు చేసినవాటిలో 72 ట్రాప్ కేసులు, 12 అక్రమాస్తుల కేసులు, 11 నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, రెగ్యులర్ విచారణలు 26, ఆకస్మిక తనిఖీలు 45 ఉన్నాయి.

ఇదీ చూడండి: లంచంపై పోరుకు ఆన్‌లైన్‌ ఆయుధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.