హైదరాబాద్ బేగంపేట డివిజన్లోని భగవంతాపూర్లో తన సొంత నిధులు రూ.14 లక్షల వ్యయంతో చేపట్టిన దండు మారమ్మ ఆలయ నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తికావచ్చాయని, త్వరలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
అనంతరం స్థానికంగా ఉన్న సేవరేజ్ పైప్లైన్ తరచూ ఓవర్ ఫ్లో అవుతూ రోడ్లపైకి నీరు చేరుతుందని, తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి ఉన్నారు.
ఇదీ చదవండి: ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంపు