Anganwadi Teachers and Helpers Retirement Age Increased Telangana : అంగన్వాడీ ఉపాధ్యాయులు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడంతో పాటు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్, ప్రత్యేక ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు రూ.లక్ష, మినీ అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50వేల ప్రత్యేక ఆర్థికసాయం అందించనున్నారు.
Satyavathi Rathod Wishes to Anganwadi Workers : ముఖ్యమంత్రి కేసీఆర్ విశాల ధృక్పథంతో అంగన్ వాడీల విషయంలో నిర్ణయం తీసుకున్నారని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటు సీఎంకు కృతజ్ఞతలు.. అంగన్ వాడీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్ మాత్రమేనని మంత్రి అన్నారు. అంగన్ వాడీల సమస్యల పట్ల తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్.. వాటిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఇది ప్లే స్కూల్ కాదండి బాబు.. 'అందమైన' అంగన్వాడీ కేంద్రమే..
Satyavathi Rathod Fire on Central Government : బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా పది శాతం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం మోదీ సర్కారు కేంద్రం వాటాను 90 నుంచి 60 శాతానికి తగ్గించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్ వాడీలకు ఇస్తున్న జీతాలు అరకొరగానే ఉన్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
Telangana Anganwadi Centers : రాష్ట్రంలో అంగన్ వాడీలు మొత్తం 35700 ఉన్నాయి. అందులో పెద్ద(Main Anganwadi) అంగన్ వాడీల సంఖ్య 31711, మినీ అంగన్ వాడీలు 3989 ఉన్నాయి. ప్రస్తుతం మినీగా ఉన్న వాటిని ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలుగా ప్రభుత్వం మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 149 ఉండగా.. గ్రామీణంలో 99, పట్టణంలో 25, గిరిజన ప్రాంతాల్లో 25 ఉన్నాయి. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకి చదువుపై ఆశక్తి కలిగేలా టీచర్లు చేస్తారు. దీంతో పాటు హెల్త్ చెక్ఆప్లు, న్యూట్రిషన్ ఫుడ్ అందేలా చేయడం.. తదితర బాధ్యతలు అంగన్ వాడీ సిబ్బంది చూసుకుంటారు.
'అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలకు అనుసంధానం చేయొద్దు'
అంగన్వాడీ టీచర్‌గా మారిన కేంద్రమంత్రి.. విద్యార్థులకు పాఠాలు
Collector daughters in anganvadi: అంగన్వాడీ కేంద్రానికి కలెక్టర్ పిల్లలు..