ETV Bharat / state

ఏపీ​ గవర్నర్​గా నేడు బిశ్వభూషణ్​ హరిచందన్​ ప్రమాణం - andhrapradesh new governer bishvabhushan harichandan will charg today

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డితోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ప్రముఖుల మధ్య... ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

గవర్నర్​గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం నేడే..
author img

By

Published : Jul 24, 2019, 7:54 AM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్​కుమార్​ భిశ్వభూషణ్​చే ప్రమాణం చేయించనున్నారు. విభజన అనంతరం కూడా నరసింహన్​ రెండు రాష్ట్రాలకు గవర్నర్​గా వ్యవహరించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్​కు తొలి గవర్నర్​గా బిశ్వ భూషణ్​ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మంగళవారమే రాష్ట్రానికి చేరుకున్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు. రాజ్ భవన్​ను సర్వాoగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గవర్నర్ ముఖ్యులతో సమావేశమయ్యే మందిరాన్ని కలంకారి చిత్ర రూపాలతో అందంగా అలంకరించారు. 11.15 గంటలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజ్ భవన్​కు చేరుకుంటారు. 11.20కి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుని.. గవర్నర్​ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేస్తారు. 11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో సెషన్, తేనీటి విందుతో కార్యక్రమం ముగుస్తుంది. గవర్నర్ ప్రమాణ స్వీకారం దృష్ట్యా రాజ్ భవన్ ప్రాంతంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ : 'కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్'

Bengaluru, Jul 23 (ANI): After the Congress-JD(S) coalition failed the trust motion in Karnataka, Congress leader and former state chief minister Siddaramaiah said the rebel party MLAs who did not participate in the trust vote violated the whip by abstaining from the house, and thus attract disqualification. "15-16 of our MLAs violated the whip by abstaining from the House during trust vote, thereby; it is a clear violation of Schedule 10 (of the Constitution) and attracts disqualification," Siddaramaiah told reporters outside the assembly after the trust vote. The ruling coalition could get only 99 votes against 105 of BJP in the 224-member house.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.