ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. రుణభారం ఎంతంటే? - Increased debt burden in AP latest news

Increased Debt Burden In AP: ఏపీ అప్పులకుప్పగా మారుతోంది. నానాటికీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు పెరిగిపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం పెండింగు బిల్లులతో సహా రాష్ట్ర రుణ భారం రూ.8.71 లక్షల కోట్లుగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలానికి చేసిన అప్పులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం కనిపిస్తోంది. మిగిలిన రెండు నెలల లెక్కలనూ తీసుకుంటే రుణ మొత్తం మరింత పెరుగుతుందని అంచనా. ఇంత చేసినా.. ఉద్యోగులకూ వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. చేసిన పనులకూ బిల్లులు రావడం లేదు. అభివృద్ధి పనులూ ముందుకు సాగని పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది..

Increased Debt Burden In AP
Increased Debt Burden In AP
author img

By

Published : Dec 3, 2022, 10:07 AM IST

Increased Debt Burden In AP: ఆంధ్రప్రదేశ్​లో ఉద్యోగులకు జీతం సకాలంలో రావడం లేదు. విశ్రాంత ఉద్యోగికి ఒకటో తేదీన పింఛను జమ కావడం లేదు. పని చేసిన గుత్తేదారుడికి బిల్లులు చెల్లించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తే బిల్లులు దక్కుతాయన్న నమ్మకం లేదు. పనులు చేసే ధైర్యం కాంట్రాక్టరుకు లేదు. కొత్త టెండర్లు దాఖలు చేసేందుకు చాలాచోట్ల ఎవరూ ముందుకు రావడం లేదు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు ఇవ్వాలని అడుగుతున్నా ప్రభుత్వం నెలల తరబడి చెల్లింపులు జరపడం లేదు.

డీఏ బకాయిలూ ఇవ్వడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దురావస్థకు ఇవన్నీ అద్దం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టులు చెప్పినా బిల్లులు ఇవ్వకపోవడంతో అధికారులు బాధ్యులవుతున్నారు. నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం తొలి 6 నెలల కాలానికే రూ.49, 278 కోట్ల రుణాలను సమీకరించినట్లు సాక్షాత్తూ ప్రభుత్వమే కాగ్​కు సమాచారం ఇచ్చింది. కాగ్ ఈ లెక్కలను తన వెబ్​సైట్​లో పొందుపరిచింది.

తొలి 6 నెలల్లోనే రూ.67,578 కోట్లు: వీటికి మరో 2 నెలల గణాంకాలను జత చేయాల్సి ఉంది. ఎంత లేదన్నా మరో రూ.10వేల కోట్ల వరకు ఆ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఇంకా బేవరేజెస్ కార్పొరేషన్​ల ద్వారా తీసుకున్న రూ.8,300 కోట్ల అప్పును జత చేయాల్సి ఉంటుంది. ఇతర కార్పొరేషన్ల ద్వారా మరో రూ.10వేల కోట్ల రుణాలను సమీకరించినట్లు సమాచారం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ వినియోగించుకున్న రుణం తొలి 6 నెలల్లోనే రూ.67,578 కోట్లుగా తేలుతుంది. అక్టోబరు, నవంబరు నెలల్లో అప్పులను కలిపితే ఇది మరింత పెరగనుంది.

మారని ప్రభుత్వ సరళి: అప్పులు చేసి కుదేలవుతున్న దేశాల అనుభవాలు కళ్లముందు కనిపిస్తున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీ ప్రభుత్వ సరళి మారలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఏపీలో రూ.48,724 కోట్ల రుణాలనే వినియోగించుకుంటామని బడ్జెట్ గణాంకాల్లో ప్రతిపాదించారు. ఇదే మొత్తానికి చట్టసభల ఆమోదం పొందారు. అలాంటిది తొలి 6 నెలల్లోనే ఆ అంచనాలు దాటిపోయాయి. ఇదే తీరున అప్పులు చేస్తూ పోతే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లను దాటి రుణాలు తీసుకునే పరిస్థితులున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కేంద్ర ఆర్థికశాఖలు తప్పుబట్టినా: అనేక కొత్త నమూనాల్లో ప్రభుత్వం జాతీయ బ్యాంకుల నుంచి రుణాలను సమీకరిస్తోంది. భవిష్యత్తు ఆదాయాలను కార్పొరేషన్లకు తాకట్టు పెట్టి మరీ వేల కోట్ల రూపాయల రుణాలు పొందుతున్న వైనాన్ని రిజర్వు బ్యాంకు, కేంద్ర ఆర్థికశాఖలు తప్పుబట్టినా రుణాలను సమీకరిస్తూనే ఉంది. ఏపీలో అప్పుల గణాంకాలన్నీ రహస్యమే. సాక్షాత్తూ కంప్ట్రోరల్ అండ్ ఆడిటర్​ జనరల్​లోని ఒక విభాగం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కార్పొరేషన్ల ద్వారా ఎన్ని రుణాలు ఎప్పటికి సేకరించారో తెలియజేయాలని అడుగుతూనే ఉంది.

పెండింగు బిల్లులు అతి పెద్ద సమస్య: గతంలో కార్పొరేషన్ల అప్పులను కాగ్​కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేది కాదు. బడ్జెట్ ద్వారా తిరిగి తీర్చే ఏ రుణమైనా రాష్ట్ర ప్రభుత్వ అప్పు అని ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొంది. మరోవైపు కేంద్ర ఆర్థికశాఖ ఇదే విషయం పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వివరాలు ఇమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ కోరుతోంది. ఎన్ని నెలలైనా వాటిని కాగ్​కు అందించడం లేదు. పెండింగు బిల్లులు రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా ఉన్నాయి.

మూడున్నరేళ్లుగా పేరుకుపోయిన బిల్లులు: మూడున్నరేళ్లుగా పెద్ద ఎత్తున బిల్లులు పేరుకుపోయాయి. దాదాపు రూ.1.50 లక్షల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని అంచనా. దీనికితోడు అదనంగా ఎప్పటికప్పుడు కొత్త బిల్లులు వచ్చి చేరుతున్నాయి. ఆర్థికశాఖ అధికారులుగానీ, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులుగానీ ఈ పెండింగు బిల్లుల మొత్తం ఎంతో వెల్లడించడం లేదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో బిల్లులను విడుదల చేయాలని ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు.

ఇవీ చదవండి: చదువుల తల్లి.. తల్లడిల్లుతోంది.. సాయం చేయరూ..!!

ఆ రాష్ట్రంలో 76 శాతానికి రిజర్వేషన్లు.. అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.