ETV Bharat / state

Gandhi doctors: గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సత్కారం - గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందికి బహుమతుల అందజేత

కరోనా నియంత్రణ కోసం ముందుండి పోరాటం చేస్తున్న గాంధీ ఆసుపత్రి వైద్యులు, నర్సులను ఆంధ్రప్రదేశ్ పెంఛరన్స్‌ అసోసియేషన్‌ సంస్థ సభ్యులు సత్కరించారు. గాంధీలో పనిచేస్తున్న 700 మందికి బహుమతులు అందజేశారు.

tribute to gandhi hospital medical workers
గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సత్కారం
author img

By

Published : Jun 1, 2021, 3:05 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్‌ పెంఛరన్స్‌ అసోసియేషన్‌ సంస్థ గాంధీ ఆసుపత్రి వైద్యులను, నర్సులను ఘనంగా సత్కరించింది. కరోనా నియంత్రణ కోసం ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులను గుర్తించి... వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బహుమతులు అందజేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు తెలిపారు.

గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న 700 మంది వైద్య సిబ్బందికి ఈ బహుమతులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 45 వేల రూపాయల విలువ చేసే మొబైల్ ఈసీజీ పరికరాన్ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుకు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పెంఛనర్స్‌ అసోసియేషన్‌ సెటిల్డ్‌ ప్రధాన కార్యదర్శి రాజు, కార్యదర్శులు చిన్నరెడ్డి, మేడిశేటి, గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌ రాజారావు, కొవిడ్‌ నోడల్‌ అధికారి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.