ETV Bharat / state

ఏపీసీసీ కొత్త టీమ్​.. ఎవరెవరికి బాధ్యతలంటే.. - 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ

APCC President: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా జంగా గౌతమ్‌, మస్తాన్‌ వలి, సుంకర పద్మశ్రీ, రాకేశ్‌రెడ్డిని నియమించారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

APCC
APCC
author img

By

Published : Nov 23, 2022, 10:37 PM IST

APCC President: ఏపీ నూతన పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. వీరితో పాటు పలువురు నాయకులను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సీనియర్‌ నేత హర్షకుమార్‌ను నియమించింది. కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ ఛైర్మన్‌గా తులసిరెడ్డి నియమితులయ్యారు.

  • Hon'ble Congress President has approved the proposal of appointment of President, Working Presidents, Chairpersons of various committees, and the Constitution of Political Affairs Committee and Coordination Committee of the Andhra Pradesh Congress Committee, as follows. pic.twitter.com/O7g4oShZWy

    — INC Sandesh (@INCSandesh) November 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నియామక ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్‌ కమిటీని నియమించారు. కో-ఆర్డినేషన్‌ కమిటీలో అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. ఇప్పటి వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఎస్.శైలజానాథ్‌ పనిచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.