ETV Bharat / state

Petrol Rates:పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించని తెలుగు రాష్ట్రాలు

పెట్రోలు, డీజిల్‌ వినియోగదారులకు దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఊరటనిచ్చాయి. వీటిపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. తామూ సిద్ధమంటూ ముందుకొచ్చి లీటరుకు రూ.7 వరకు అమ్మకపు పన్ను కుదించుకున్నాయి. దీంతో అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్‌ సుంకం, దానిపై విధించే వ్యాట్‌ తగ్గింపునకే పరిమితం కావడంతో ఊరట కొంతమేర మాత్రమే లభించింది.

Petrol Rates
వ్యాట్‌ తగ్గించని తెలుగు రాష్ట్రాలు
author img

By

Published : Nov 6, 2021, 6:32 AM IST

పెట్రోలు, డీజిల్‌ వినియోగదారులకు దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఊరటనిచ్చాయి. వీటిపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. తామూ సిద్ధమంటూ ముందుకొచ్చి లీటరుకు రూ.7 వరకు అమ్మకపు పన్ను కుదించుకున్నాయి. దీంతో అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గాయి.తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్‌ సుంకం, దానిపై విధించే వ్యాట్‌ తగ్గింపునకే పరిమితం కావడంతో ఊరట కొంతమేర మాత్రమే లభించింది. పెట్రో ధరలు ఇప్పటికీ గరిష్ఠంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ తొలి, ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. చాలా రాష్ట్రాల్లో శుక్రవారం లీటరు డీజిల్‌ రూ.90 దిగువకు చేరగా.. పెట్రోలు కూడా రూ.100 నుంచి రూ.102 లోపే ఉంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లోనే ధరలు అధికంగా ఉన్నాయి. పన్ను తగ్గింపుపై ఈ రాష్ట్రాలు తమ విధానం స్పష్టం చేయలేదు. ధరల తగ్గింపుపై ఈ నెల 9న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తామని పంజాబ్‌ ప్రకటించింది.

దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం

శుక్రవారం దేశంలో ఇంధన ధరలు చూస్తే దక్షిణాదిన ఏపీలోనే ఎక్కువ. విజయవాడలో లీటరు పెట్రోలు రూ.110.35, డీజిల్‌ రూ.96.44 ఉన్నాయి. బెంగళూరు కంటే పెట్రోలుపై రూ.9.79, డీజిల్‌పై రూ.11.44 అధికం. హైదరాబాద్‌లోనూ లీటరు పెట్రోలు రూ.108.20, డీజిల్‌ రూ.94.62 చొప్పున విక్రయిస్తున్నారు. అమ్మకపు పన్ను తగ్గింపు తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పెట్రోలు రూ.95.26, డీజిల్‌ రూ.86.80 అయింది.

  • పెట్రోలు, డీజిల్‌ మూలధరకు కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకం కలపగా వచ్చే మొత్తంపై రాష్ట్రాలు అమ్మకపు పన్ను/వ్యాట్‌ వసూలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31% వ్యాట్‌, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్‌తో పాటు రూ.1 చొప్పున (దీనిపై వ్యాట్‌ అదనం) రోడ్డు అభివృద్ధి సెస్‌ వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25% వ్యాట్‌, లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌, రూ.1 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్‌ (దీనిపై వ్యాట్‌ అదనం) విధిస్తున్నారు. 2020-21లో ఈ పన్నుల రూపేణా రూ.11,014 కోట్ల రాబడి వచ్చింది. తెలంగాణలో పెట్రోలుపై 35.20%, డీజిల్‌పై 27% చొప్పున వ్యాట్‌ విధిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,691 కోట్ల రాబడి సాధించింది. హరియాణా పెట్రోలుపై 25% వ్యాట్‌ లేదా లీటరుకు రూ.15.62తో పాటు వ్యాట్‌పై 5% అదనపు పన్ను, డీజిల్‌పై 16.40% వ్యాట్‌ లేదా లీటరుకు రూ.10.08తో పాటు వ్యాట్‌పై 5% అదనపు పన్ను వసూలుచేస్తోంది. ఈ రాష్ట్రానికి గతేడాది వచ్చింది రూ.7,923 కోట్లు.. అయినా లీటరుకు రూ.7 తగ్గించింది.
  • రాజస్థాన్‌లోనూ పెట్రోలుపై 36% వ్యాట్‌, లీటరుకు రూ.1.50 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్‌, డీజిల్‌పై 26% వ్యాట్‌, లీటరుకు రూ.1.75 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్‌ వసూలు చేస్తున్నారు. 2020-21లో పెట్రో అమ్మకాలపై పన్నుల ద్వారా రూ.15,119 కోట్ల మేర వసూలు చేసింది. అయినా తగ్గించలేదు.

వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు: ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమబెంగాల్‌, మేఘాలయ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌
వ్యాట్‌ తగ్గించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, నాగాలాండ్‌, త్రిపుర, అస్సాం, సిక్కిం, బిహార్‌, మధ్యప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, దాద్రా-నగర్‌ హవేలి, దామన్‌-దివూ, ఛండీగఢ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, లద్దాఖ్‌.

ఎక్కువ తగ్గింపు: లద్దాఖ్‌, కర్ణాటక, పుదుచ్చేరిలో తగ్గింపు ఎక్కువగా ఉంది. ఈ మూడు చోట్ల పెట్రోలు ధర వరుసగా రూ.13.43, రూ.13.35, రూ.12.85 చొప్పున తగ్గింది. డీజిల్‌ ధర రూ.19.61, రూ.19.49, రూ.19.08 వంతున తగ్గింది.

లీటరు డీజిల్‌పై రూ.12.28 ఊరట: కేంద్రం డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే.. ఆ మేరకు రాష్ట్రాలు విధించే అమ్మకపు పన్ను తగ్గుతుంది. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో దానికి అనుగుణంగానే ఏపీలో లీటరు పెట్రోలుపై రూ.6.10, డీజిల్‌పై రూ.12.28 చొప్పున తగ్గాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోలు లీటరుకు రూ.5.70 నుంచి రూ.6.35 వరకు, డీజిల్‌ రూ.11.16 నుంచి రూ.12.88 వరకు తగ్గాయి. అదనంగా పలు రాష్ట్రాలు అమ్మకపు/వ్యాట్‌ పన్నులను కుదించుకోవడంతో ధరలు మరింత తగ్గాయి.-

  • కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని, పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు/వ్యాట్‌ పన్నులను తగ్గించుకున్నాక.. దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం పెట్రోలు, డీజిల్‌ ధరలు (లీటరుకు రూ.ల్లో)

ఇదీ చదవండి: Pratidhwani: పెట్రో ధరల తగ్గింపుతో సామాన్యులకు ఊరట ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.