ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను పురావస్తుశాఖ అధికారులకు అప్పగించి విచారణ జరిపిస్తామని చిత్తూరు తహసీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు.
నాణేలకు బంగారు పూత పూసి ఉందని.. ఈ నాణేలను వెలికి తీయడానికి మహిళ ఇంట్లో కొందరు పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూజలు నాణేల కోసమే చేశారా? లేక ఎక్కడివైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు.