ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి ..14 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపారు. నిర్మాణ పనులకు 17 కోట్ల రూపాయలు కూడా మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ కాంట్రాక్టును సొంత చేసుకుని పనులు చేపట్టింది. అయితే..స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అడగకుండా పనులు చేపట్టడం ఏంటని..వైకాపా నేత జయరామిరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు.
"ఏయ్ మీ వాడిని వచ్చి మాట్లాడమనండి. నా ఫోన్ ఎత్తడా. పనులన్నీ అపేయండి. లేకుంటే అన్ని పగులగొట్టిస్తా. చేతనైతే పోలీసు కంప్లైంట్ ఇవ్వమనండి. నాకు కొత్తేం కాదు. నాకు తెలియకుండా పని మెుదలుపెడతాడా. నేను ఎవర్ని వదలను. అన్ని వాహనాల అద్దాలు పగులగొట్టిస్తా. ఏదైనా ఉంటే వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడమనండి." అంటూ బెదిరింపులకు దిగాడు.
బెదిరింపులకు దిగిన వైకాపా నేత జయరామిరెడ్డిది...రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం కాలేకుర్తి గ్రామం. జయరామిరెడ్డి భార్య ఉషారాణి రాయదుర్గం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్గా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి : MLA Rajaiah viral video: చిన్నారులతో కలిసి బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే