ETV Bharat / state

బయట నిలబడిన వ్యక్తిపై మద్యం మత్తులో దాడి - Hooligan riots in Bagh Lingampally

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో కొందరు పోకిరీలు హల్చల్ చేసి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఎల్ఐసీ కాలనీకి చెందిన బాబు తన ఇంటి ముందు నిలబడగా అతనిపై దాడి చేశారు.

An intoxicated attack on a man standing outside at baghlingampally
బయట నిలబడిన వ్యక్తిపై మద్యం మత్తులో దాడి
author img

By

Published : Jul 20, 2020, 9:12 PM IST

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఎల్ఐసీ కాలనీలోని కొందరు పోకిరీలు మద్యం తాగి హంగామా సృష్టించారు. కొందరు పోకిరీలు మద్యం మత్తులో ఇళ్లలో ఉన్నవారిని బయటకు పిలిచి చితకబాదారు. ఎల్ఐసీ కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి తన ఇంటి ముందు నిలబడగా, మద్యం తాగిన శ్రీకాంత్, శ్రీను, మధు, యశ్వంత్​లు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఘటనలో బాబుకు నోటి పళ్లు ఊడి తీవ్రంగా గాయపడ్డాడు.

గత కొన్ని రోజులుగా పోకిరీలు రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద రాత్రులు తాగి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. వారిపై చర్య తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాబుపై దాడి చేసిన వారిపై పలు కేసులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. పోకిరీలను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బయట నిలబడిన వ్యక్తిపై మద్యం మత్తులో దాడి

ఇదీ చూడండి : ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ లేక చనిపోవడం దారుణం : ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.