హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. మాయాబజార్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ చిత్రాలను నగరానికి చెందిన ఆశా రాధిక ఏర్పాటు చేశారు. బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తూనే... ఆమె అభిరుచి అయిన చిత్రకళను కొనసాగిస్తున్నారు. పిల్లల మానసిక పరివర్తన రూపాంతరీకరణకు చిత్రకళ దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈనెల 12 వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: అక్టోబర్‌లో రికార్డు స్థాయికి.. యూపీఐ లావాదేవీలు