ETV Bharat / state

అంపన్ ధాటికి వణుకుతున్న ఉప్పాడ - uppada effected by umphan

అంపన్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈదురు గాలులకు ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. తీరం కోతకు గురై ఇంకొన్నిళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

uppada-amphan story
అంపన్ ధాటికి వణుకుతున్న ఉప్పాడ
author img

By

Published : May 20, 2020, 12:21 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడి పెను తుపానుగా మారిన అంపన్ ప్రభావం ఉప్పాడ తీరంపై చూపింది. గత మూడు రోజులుగా సముద్రంలో మార్పులు ఏర్పడి రాకాసి కెరటాలు కలకలం సృష్టిస్తున్నాయి. భారీ ఎత్తులో ఎగిసిపడుతున్న కెరటాలతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తీరప్రాంత గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి పది గంటల నుంచి అలలు తీవ్ర రూపం దాల్చి పదుల సంఖ్యలో ఇళ్లు, చెట్లను నేలకూల్చాయి.

కెరటాల ప్రభావం తగ్గకపోవడం వల్ ఇప్పటికే మరికొన్ని ఇళ్లు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇళ్లు, సామగ్రి కోల్పోయిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల గృహాల్లోని సామాగ్రి, విద్యుత్ ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులకు తలదాచుకునే దారిలేక చేతచిక్కిన సామానుతో నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. రాత్రికి రాత్రే సుమారు 30 మీటర్ల దూరం సముద్రం ముందుకు రావడం వల్ల తీరప్రాంత వాసులు భయాందోళనలు చెందుతున్నారు.

అంపన్ ధాటికి వణుకుతున్న ఉప్పాడ

ఇదీ చూడండి: ఉద్యోగాలు పోతాయి... కానీ..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.