ETV Bharat / state

నేడు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా - BJP Leaders Meeting

Amit Shah Telangana Tour Today : పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాషాయదళం సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. నేడు రంగారెడ్డి జిల్లా శ్లోక కన్వెన్షన్‌లో నిర్వహించే బీజేపీ లీడర్ల సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు త్వరలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశానిర్ధేశం చేయనున్నారు.

Amit Shah Telangana Tour Schedule
Amit Shah Telangana Tour Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 9:05 AM IST

Amit Shah Telangana Tour Today : బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సంసిద్ధత కోసం ఇవాళ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. మండల స్ధాయి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు హాజరయ్యే ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు త్వరలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశానిర్ధేశం చేయనున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర విభాగం నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ సమావేశానికి మండల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు హాజరు కానున్నారు.

కాంగ్రెస్‌ 'విరాళాల' బాట- లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధం- పార్టీ ఆవిర్భావం రోజునే!

Amit Shah Telangana Tour Schedule : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతోపాటు లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను అమిత్‌ షా సన్నద్ధం చేయనున్నారు. మధ్యాహ్నాం ఒంటిగంట 25 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నేరుగా నొవాటెల్‌కు వెళతారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. తర్వాత ఛార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్లోక కన్వెన్షన్‌కు వెళ్లి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు విస్తృస్థాయి సమావేశంలో పాల్గొంటారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలపై కమలం పార్టీ గురి - టికెట్ల కోసం నాయకుల మధ్య హోరాహోరీ పోటీ

Amit shah Meeting to BJP Leaders : దేశంలో పార్లమెంట్​ ఎన్నికలు వచ్చే ఏడాది నాలుగో నెలల్లో జరగునున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమ నాయకులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నా పార్టీ ప్రముఖ నాయకులకు అగ్ర నేతలు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ(BJP) గెలుపు దిశగా పయనించేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా సీట్లు రాకపోయినా, ఓట్ల శాతం పెరిగిందని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

BJP Leaders Meeting in Hyderabad : ప్రజలు బీజేపీ నాయకత్వం కోరుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో డబుల్​ డిజిట్​లో గెలుస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. ఇప్పటికే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు లోక్​సభ స్థానాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పార్లమెంట్​ ఎన్నికల్లో డబుల్​ డిజిట్​తో గెలుస్తాం : కిషన్​రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి : బీజేపీ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.