Amit Shah Telangana Tour On September 17th : కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా(Amit Shah) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ప్టెంబర్ 17వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. ఆరోజు నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొననున్నారని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయని వెల్లడించారు.
Amit Shah Hyderabad Tour : మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండోసారీ నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground) సిద్ధమవుతోంది. ఉత్సవాలకు ముఖ్య అథితిగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు. గత సంవత్సరం మొదటిసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫువ అధికారికంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
Telangana Liberation Day 2023 : మరోవైపు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోవడంపై రాజకీయంగా పెను దుమారమే చెలరేగింది. కేసీఆర్ మజ్లిస్‌కు తలొగ్గి నిర్వహించడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. కేంద్రం మాత్రం అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
Telangana Liberation Day on September 17th : అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల(Telangana Assembly Elections 2023) హడావుడి షురూ అయింది. బీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితా విడుదల చేయగా కాంగ్రెస్ మరికొన్ని రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రక్రియ ముమ్మరం చేసింది. మరోవైపు బీజేపీ మాత్రం ఇప్పుడిప్పుడే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే ఈసారి ఎన్నికలపై మాత్రం కమలం చాలా స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా పాతాలని చూస్తోంది. అయితే గత కొంతకాలంగా బీజేపీలో ఉత్సాహం కొరవడింది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన రాష్ట్ర నేతల్లో ఉత్సాహం కలిగిస్తోంది.
Amit Shah To Attend Telangana Liberation Day 2023 : తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం అమిత్ షా.. రాష్ట్ర నేతలతోనూ సమావేశమవుతారని సమాచారం. ఈ సమావేశంలో తాజా రాష్ట్ర రాజకీయాలు.. రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపి.. అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక, వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్ర నేతల్లో జోష్ నింపి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయ ఢంకా మోగించేలా నేతలకు అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.
Amit Shah Khammam Meeting : ఖమ్మంలో 'రైతు గోస- బీజేపీ భరోసా' సభతో.. రాష్ట్రంలో వేడేక్కిన రాజకీయం