ETV Bharat / state

తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయండి : అమిత్​ షా - రంగారెడ్డి బీజేపీ సమావేశం

Amit Shah Speech at Telangana BJP Leaders Meeting : తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేంద్రమంత్రి అమిత్​ షా దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

amit shah
amit shah bjp meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 7:05 PM IST

Updated : Dec 28, 2023, 8:23 PM IST

Amit Shah Speech at Telangana BJP Leaders Meeting : ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400 పైగా సీట్లు గెలుస్తామని కేంద్రమంత్రి అమిత్​ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని, ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించామని హర్షించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలో 64 లేక 95 సీట్లు రావచ్చని జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలార్​లో ఉన్న శ్లోక కన్వెక్షన్​లో జరిగిన బీజేపీ(BJP) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్​ షా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు ఆహ్వానించారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్(KCR)​ సర్కార్​ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కేంద్రమంత్రి అమిత్​ షా ఆరోపణలు చేశారు. మాదిగ సమాజానికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు. 25 శాతానికి పైగా ఓట్లు 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ నాది అనేలా పనిచేయాలన్నారు. ముందుగా సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని డీకే అరుణ ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో మోదీ(PM Modi) విజయం చారిత్రక అవసరమనే తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశంలో అందరూ ఆమోదించారు.

తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయండి అమిత్​ షా

తెలంగాణ పార్లమెంట్​ ఎన్నికల్లో డబుల్​ డిజిట్​తో గెలుస్తాం : కిషన్​రెడ్డి

చార్మినార్​ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం : అంతకు ముందు చార్మినార్​ భాగ్యలక్ష్మీ(Charimar Bhagya Lakshmi) అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్​ షా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులు ఇచ్చిన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమిత్​ షా వెంట కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఉన్నారు.

Amit Shah Serious BJP Telangana Leaders : వర్గ విభేదాలు వల్లే పార్టీ తెలంగాణలో నష్టపోయిందని ఇక నుంచి ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పని చేయాలని పార్టీ నేతలకు కేంద్రమంత్రి అమిత్​ షా వార్నింగ్​ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని, 30 సీట్లు వస్తాయని ఆశిస్తే రాలేదన్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్​సభ(Lok Sabha) ఎన్నికల్లో సమన్వయంతో పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

ఈసారి రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈసారి కూడా సిట్టింగ్​ ఎంపీలకే అవకాశం కల్పిస్తామని, మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ ఎన్నికల్లో కాకుండా ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శంషాబాద్​ విమానాశ్రయంలో దిగి నేరుగా అమిత్​ షా నగరంలోని నొవాటల్​కు వెళ్లి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

'వర్గ విభేదాలు వదిలి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి' - రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్​ షా వార్నింగ్​

తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా : ఎంపీ లక్ష్మణ్

Last Updated : Dec 28, 2023, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.