ETV Bharat / state

మూడోసారి కూడా అవకాశమివ్వండి: అమీర్​పేట్​ కార్పొరేటర్​

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నగరంలో మూడో రోజు నామినేషన్ల జోరు కొనసాగుతోంది. అమీర్​పేట్​ డివిజన్​లో తెరాస కార్పొరేటర్​ శేష కుమారి నామినేషన్​ వేయడానికి భారీ ర్యాలీతో వెళ్లారు. రెండు సార్లు తనను గెలిపించిన ప్రజలు మూడోసారి కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ameerpet trs corporator puts nomination
మూడోసారి కూడా అవకాశమివ్వండి: అమీర్​పేట్​ కార్పొరేటర్​
author img

By

Published : Nov 20, 2020, 1:39 PM IST

రానున్న బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగుర వేస్తామని అమీర్​పేట్​ సిట్టింగ్ తెరాస కార్పొరేటర్ శేషకుమారి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడానికి శుక్రవారం.. శేష కుమారి భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. రెండుసార్లు తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని కార్పొరేటర్​ అన్నారు. మూడోసారి కూడా తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని శేషకుమారి అన్నారు. అమీర్​పేట్​ డివిజన్​ అభివృద్ధికి మరింత కృషి చేయడానికి ప్రజలు తనకు అవకాశం కల్పించాలని కోరారు. ర్యాలీలో స్థానిక తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 9 మంది సిట్టింగ్‌లకు షాక్‌.. కొత్తవారికి టికెట్​ ఇచ్చిన తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.