గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. తన సొంత నిధులతో కూకట్పల్లి నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లు ఇవ్వడం జరిగింది. వీటి విలువ ఒక్కొక్కటి 22 లక్షల రూపాయలు.. ఈ నేపథ్యంలో కేటీఆర్ అంబులెన్స్‌లను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్1 రాష్ట్రంగా నిలుస్తుందని.. అన్నారు. ఇటువంటి గొప్ప నాయకుల నాయకత్వంలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన వంతు సాయంగా రెండు అంబులెన్స్‌లను ప్రజా సేవకు అందించడం జరిగిందని తెలిపారు. ఇక నుంచి అంబులెన్స్‌లు కూకట్పల్లి, బాలానగర్ మండలాల్లో ప్రజలకు ఉపయోగపడుతాయని అన్నారు. 104కి కాల్ చేస్తే.. ఆపదలో ఉన్న వారిని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇదీ చూడండి: సొంత నిధులతో... అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు