ETV Bharat / state

అక్టోబర్​ 5 నుంచి అంబేడ్కర్​ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల తేదీలను ప్రకటించింది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలను అక్టోబరు 5 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయం వెబ్​సైట్ నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ambedkar open university degree exams started from october 5th
అక్టోబర్​ 5 నుంచి అంబేడ్కర్​ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
author img

By

Published : Sep 16, 2020, 6:17 PM IST

డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు అక్టోబరు 5 నుంచి నిర్వహించాలని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆరో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 10 వరకు.. ఐదో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 16 వరకు జరగుతాయని యూనివర్సిటీ వెల్లడించింది. మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుంచి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అదేవిధంగా ఓల్డ్ బ్యాచ్ డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు అంబేడ్కర్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయం వెబ్​సైట్ నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవాలన్నారు.

ఇవీ చూడండి: శ్రీశైలం అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలి: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.