ETV Bharat / state

ట్యాంక్​బండ్​పై అంబేడ్కర్​ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్​ జయంతి వేడుకలను ఎస్సీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్​బండ్​పై గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శుక్రవారం పంజాగుట్ట ప్రధాన కూడలి నుంచి తీసివేసిన అంబేడ్కర్​ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Apr 14, 2019, 5:57 AM IST

అంబేడ్కర్​ జయంతి వేడుకలు
అంబేడ్కర్​ జయంతి వేడుకలు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 128వ జయంతిని... అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అర్ధరాత్రి హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. ట్యాంక్​బండ్​పై ఉన్న ఆయన విగ్రహం వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేక్​కట్ చేసి.. టపాసులు పేల్చుతూ... ఘనంగా నివాళులర్పించారు. పంజాగుట్టలో విగ్రహాన్ని కూల్చిన ఘటనలో బాధ్యులతో పాటు దీని వెనుక ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలని కమిటీ నాయకులు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు.
అంబేడ్కర్​ విగ్రహం కూల్చిన స్థలంలోనే విగ్రహాన్ని పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఇవీ చూడండి: "జిల్లా , మండల పరిషత్ ఎన్నికలకు తెరాస సన్నద్ధత"

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.