కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర సర్కార్ లాక్డౌన్ విధించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి భౌతిక దూరం పాటించాలని సూచించింది.
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో రహదారులు, మార్కెట్లు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించని 40 మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ తెలిపారు.