ETV Bharat / state

నేటి నుంచి ఏపీలో రాజధాని రైతుల మహాపాదయాత్ర.. సర్వం సిద్ధం - ap news

ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు ఆవిష్కృతం కానుంది. నేటి నుంచి రైతులు, మహిళలు ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

padayatra
padayatra
author img

By

Published : Nov 1, 2021, 8:54 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు ఆవిష్కృతం కానుంది. నేటి నుంచి రైతులు, మహిళలు ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వర స్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు, సర్వమత ప్రార్థనల అనంతరం రాజధాని ఉద్యమ జెండా ఊపి యాత్ర మొదలవుతుంది. తుళ్లూరులో ఉదయం 9 గంటల 5 ఐదు నిమిషాలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. న్యాయస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు 45 రోజులపాటు పాదయాత్ర జరగనుంది.యాత్రకు సంబంధించి సర్వం సిద్ధమైంది.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు తమ పోరు ఉద్ధృతం చేస్తున్నారు. 684 రోజులుగా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో హోరెత్తిస్తున్న రైతులు, మహిళలు.. నేటి నుంచి ప్రజా పాదయాత్ర పేరుతో ముందడుగు వేస్తున్నారు. ప్రజా పాదయాత్రకు తొలుత సమ్మతి నిరాకరించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాలతో షరతులతో కూడిన అనుమతి పోలీసులు మంజూరు చేశారు. తొలి 6 రోజులు గుంటూరు జిల్లాలో ప్రజా పాదయాత్ర కొనసాగనుంది. కనీసం రోజుకు 12 నుంచి 14 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. ఆదివారం యాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఎప్పటికప్పుడు పాతవారి స్థానంలో కొత్తవారిని చేర్చుకునేలా రూపకల్పన చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 9 కమిటీలను నియమించి పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.అమరావతి నిరసన ఉద్యమం మాదిరిగానే పాదయాత్ర పూర్తిగా శాంతి, అహింస మార్గంలో నడుస్తుందని.. ఐకాస నేతలు తెలిపారు.

''మహా పాదయాత్రపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తున్నారని.. అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెప్పారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని.. 5కోట్ల ప్రజల జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యగా అమరావతి పరిరక్షణ సమితి నాయకులు పేర్కొంటున్నారు. 13 జిల్లాల ప్రజలు తమ పోరాటానికి సంఘీభావం తెలిపాలని కోరుతున్నారు.'' - శివారెడ్డి, అధ్యక్షుడు అమరావతి పరిరక్షణ సమితి

తొలిరోజు పాదయాత్రలో భాగంగా తుళ్లూరు నుంచి పెదపరిమి మీదుగా తాడికొండ వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి: Revanth reddy tweet: నిరుద్యోగులు పిట్టల్లా రాలుతుంటే కేటీఆర్‌ గొప్పలు చెబుతారా?: రేవంత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.