విశాఖ ఉక్కు పరిరక్షించుకుందాం అంటూ అమరావతి రైతులు, మహిళలు.. 422వ రోజు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఎర్రబాలెం, అనంతవరం, దొండపాడు, పెదపరిమి, నెక్కల్లు, పెనుమాక, నేలపాడులో రైతులు, మహిళలు నిరసన దీక్షలు చేశారు. తుళ్లూరు, మందడం, నేలపాడులో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ మూడోరోజు నిరాహార దీక్షలు చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దొంగ నాటకాలుడుతున్నాయని విమర్శించారు. వీరి కుట్రలను ఎండగడతామని మహిళలు స్పష్టం చేశారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులకు ఎన్నారైలు మద్దతుగా నిలిచారు. శిబిరాల నిర్వహణకు యండూరి శ్రీనివాసరావు రూ. 5 లక్షల చెక్కును... తుళ్లూరు రైతులకు అందజేశారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు 12 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు.
ఇదీ చూడండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం