ETV Bharat / state

కార్పొరేటర్ సొంత నిధులతో రోడ్డుకు మరమ్మతులు - hyderabad news

వర్షాల వల్ల నగరంలోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ప్రజల విజ్ఞప్తిపై కొందరు కార్పొరేటర్లు సొంత నిధులతో రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. కూకట్​పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్ నుంచి ఉషా ముళ్లపూడి రోడ్డుకు వెళ్లే రహదారికి స్థానిక కార్పొరేటర్​ వెంకటేష్​ గౌడ్​ సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్నారు.

alwyn colony corporator Temporary repairs to the road with own funds in hyderabad
సొంత నిధులతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు
author img

By

Published : Oct 21, 2020, 7:25 PM IST

రాజధానిలో అంతర్గత రహదారుల పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించి అభివృద్ధి చేస్తోంది. ఇంకా కొన్ని కాలనీ రహదారులు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి రహదారుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై స్థానిక కార్పొరేటర్లు కొందరు స్పందించి తమ సొంత నిధులతో రహదారులను అభివృద్ధి చేస్తున్నారు.

కూకట్​పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్ నుంచి ఉషా ముళ్లపూడి రోడ్డుకు వెళ్లే రహదారి ఇటీవల వర్షాల కారణంగా రోడ్డు అధ్వానంగా తయారైంది. ప్రజలు స్థానిక కార్పొరేటర్​కు తెలపగా ఆయన స్పందించారు. స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తన సొంత నిధులు లక్ష రూపాయలను వెచ్చించి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్నారు. కార్పొరేటర్​ చూపించిన చొరవకు స్థానికుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

ఇవీ చూడండి: వరదాగ్రహం: పోలీసు కారెక్కి మహిళ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.