ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్​లో సంక్షేమానికి పెద్దపీట.. ఎంత కేటాయించారంటే? - WELFAR BUDGET IN STATE

Budget Allocation for TS State Welfare: రాష్ట్ర బడ్జెట్​లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీసీ వర్గాల సంక్షేమానికి రూ.6,229 కోట్లు, షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతికి రూ.36,750కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

రాష్ట్ర సంక్షేమానికి బడ్జట్ కేటాయింపు
రాష్ట్ర సంక్షేమానికి బడ్జట్ కేటాయింపు
author img

By

Published : Feb 6, 2023, 12:07 PM IST

Updated : Feb 6, 2023, 12:46 PM IST

Budget Allocation for TS State Welfare: రాష్ట్ర బడ్జెట్​లో సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మంత్రి హరీశ్​రావు బీసీ వర్గాల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతికి రూ.36,750కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఇక హరీశ్​రావు మాట్లాడుతూ... ‘‘వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోంది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం.. తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. ఇక స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి చేనేత, పవర్ లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియోట్యాగింగ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ అందించడమే కాకుండా, నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమాను అందిస్తున్నాం. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్‌గా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టింది. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో రూ.6229 కోట్లు కేటాయిస్తున్నాం’’

షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతికి రూ.36,750: ‘‘షెడ్యూల్‌ కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ బడ్జెట్‌లో షెడ్యూలు కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.36,750 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20లక్షల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇక గిరిజన సంక్షేమం కోసం షెడ్యూల్‌ తెగల ప్రత్యేక నిధి కింది రూ.15,233కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’

బీసీ వర్గాల సంక్షేమం:

1. వృత్తిపనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది.

2. పశుగణాభివృద్ధిలోనూ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిలోనూ ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. జీఎస్డీపీలో పశుసంపద రంగం వాటా 2014-15లో 6.3 శాతంగా ఉండగా, 2021-22 నాటికి 9 శాతానికి పెరిగింది. పశుసంపద రంగం విలువ 2021-22లో 93,599 కోట్లుగా ఉన్నది.

3. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం.. తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

4. మన రాష్ట్రంలోని గొల్ల కుర్మల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలున్నాయి. తెలంగాణలో మాంస ఉత్పత్తి 2014లో 5.05 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. మాంస ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో నిలిచిన తెలంగాణ ‘‘పింక్ రెవల్యూషన్’’ను సాధించింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 6, 2023, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.