ETV Bharat / state

తెలంగాణ బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు - బడ్జెట్​లో వ్యవసాయరంగం వాటా

agriculture sector in the annual budget 2023-24n in TS: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయానికి రూ.26,831 కోట్లు బడ్జెట్​లో కేటాయించింది.

బడ్జెట్​లో వ్యవసాయరంగం వాటా
బడ్జెట్​లో వ్యవసాయరంగం వాటా
author img

By

Published : Feb 6, 2023, 11:34 AM IST

Updated : Feb 6, 2023, 12:51 PM IST

తెలంగాణ బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు

agriculture sector in the annual budget 2023-24 in TS: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అందులో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్​లో ఏకంగా రూ.26,831 కోట్లను.. వ్యవసాయానికి కేటాయించారు. సభలో మంత్రి హరీశ్​ రావు మాట్లాడుతూ... ‘సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశనం చేస్తోంది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని'' పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేళ్ల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్ల నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటినుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు, అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందని మంత్రి సభలో వివరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు చేశారన్నారు.

‘‘పామాయిల్‌ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు లక్షా 50వేల రూపాయల వరకూ నికర ఆదాయం వస్తోంది ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని 20లక్షల ఎకరాలకు పెంచాలనేది లక్ష్యం. ఇందులో భాగంగానే ఆయిల్‌ పామ్‌ సాగుకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ’’ - మంత్రి హరీశ్​రావు

"ఇది ప్రజల బడ్జెట్. ఇది రైతు ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు కేటాయించడం హర్షణీయంగా ఉంది. వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఆయిల్ పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.2 లక్షల 90 వేల కోట్లలో రూ.53 వేల 700 కోట్లు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి కేటాయించడం గమనార్హం. 2014 నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వమే. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి." -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Feb 6, 2023, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.