ETV Bharat / state

Allegations RGI police fake certificates Case : నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఎస్సై భర్త ప్రమేయం..! కేసును నీరుగార్చిన పోలీసులు - Fake certificates

Allegations against RGI police in fake certificates case : నేరం చేస్తే ఎంతటి వ్యక్తులైనా చట్టం ముందు నిలబెట్టాలన్నది రాజ్యాంగ నిబంధన. మనోడైతే చాలు ఎంతటి నేరమైనా ఇట్టే తప్పించుకోవచ్చని కొందరు పోలీసులు చేసే చర్యలు చెబుతున్నాయి. ఆర్జీఏఐ పోలీస్‌స్టేషన్‌లో నకిలీ సర్టిఫికెట్ల దందాలో ప్రమేయమున్న వ్యక్తి పేరు బయటపడకుండా చేసిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. నిందితుడు ఒక మహిళా ఎస్సై భర్త కావడమే దీనికి కారణం. తన భర్తను తప్పించాలంటూ మహిళా ఎస్సై అధికారులను కోరడంతో కటకటాలు వెనుక ఉండాల్సిన నిందితుడు తేలిగ్గా తప్పించుకున్నాడు.

Allegations RGI police
Allegations RGI police
author img

By

Published : Jul 18, 2023, 8:40 AM IST

Allegations woman SI in fake certificates case : మూడు నెలల క్రితం శంషాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావు దూర విద్యలో ఎంఎస్సీ కోర్సు చేసేందుకు తన సహఉద్యోగి సాయిబాబును సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి ఓ కార్పొరేట్‌ కళాశాలలో పీఆర్‌వోగా పనిచేస్తున్న కొత్తపేటకు చెందిన సిద్ధు యాదవ్‌ను కలిశారు. సిద్ధు తనకు పరిచయం ఉన్న శివశంకర్‌రెడ్డిని వారికి పరిచయం చేశాడు. శివశంకర్‌రెడ్డి సరూర్‌నగర్‌కు చెందిన బి. దేవెందర్‌రెడ్డి ద్వారా సర్టిఫికెట్‌ ఇప్పిస్తానంటూ అడ్వాన్సు కింద రూ.20వేలు తీసుకున్నాడు.

ఉస్మానియా, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు కావాలని నాగేశ్వరరావు, సాయిబాబు చెప్పగా.. శంకర్‌రెడ్డి, సిద్ధుయాదవ్‌లు మరో రూ.20 వేలు వసూలు చేశారు. వారం రోజు క్రితం రెండు ఎంఎస్సీ కెమిస్ట్రీ పట్టాలు ఇచ్చారు. తాము పరీక్షలు రాయకుండానే ధ్రువీకరణ పత్రాలు ఎలా ఇచ్చారనే అనుమానంతో నాగేశ్వరరావు, సాయిబాబు వాటిని తనిఖీ చేయగా నకిలీ సర్టిఫికెట్లు అని తేలింది. మోసపోయిన బాధితులు ఈనెల 12వ తేదీన ఆర్జీఏఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు బి.దేవెందర్, శివశంకర్‌రెడ్డి, కె.సిద్ధు యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మరో వ్యక్తి పేరు చెప్పారు.

కేసులో ఎస్సై భర్త ప్రమేయం..!: ఇక్కడే సైబరాబాద్‌ పరిధిలో పనిచేసే ఓ మహిళా ఎస్సై రంగ ప్రవేశం చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాలో మహిళా ఎస్సై భర్త పాత్ర ఉన్నట్లు మిగిలిన ముగ్గురూ పోలీసుల ముందు అంగీకరించారు. పోలీసులు విచారించేందుకు ప్రయత్నించగా సబ్‌ఇన్‌ స్పెక్టర్‌ ఆర్జీఏఐ పోలీసుల్ని సంప్రదించారు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త పాత్ర వెలుగులోకి రాకుండా చూడాలంటూ అధికారులకు విన్నవించారు. కేసు నమోదు కాకుండా చూడాలంటూ మహిళ ఎస్సై కోరడంతో పోలీసులు నిందితుని పేరు తొలగించి మిగిలిన ముగ్గురిపైనే కేసు నమోదు చేశారు.

ఎస్సై భర్త కావడంతో తప్పు చేసినా నేరం నుంచి తప్పించుకున్న వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఎస్సై జోక్యంతో నిందితుడ్ని తప్పించిన పోలీసులు ఈ కేసును పూర్తిగా నీరుగార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు స్టేషన్‌ బెయిలు ఇచ్చి వదిలేశారు. యూనివర్సిటీల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు ఇస్తున్న నిందితులు స్టేషన్‌ బెయిలు ఇవ్వడం కేసు నీరు గార్చేందుకేనని ఆరోపణలున్నాయి.

Fake certificates Gang arrest In Hyderabad : వాస్తవానికి ఈ కేసులో ఉస్మానియా డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు -38, జేఎన్‌టీయూ బీటెక్‌ పట్టాలు -05, ఆంధ్రా, ఆచార్య నాగార్జున, కృష్ణ దేవరాయ, కాకతీయ, వెంకటేశ్వర యూనివర్సిటీలు, కొలరాడో స్టేట్‌ ఆఫ్‌ యూనివర్సిటీ, ఇందూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.