గత ఐదేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి తన గెలుపునకు నాంది అని అల్లాపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి సబీహా గౌస్ ఉద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెరాస అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ... రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని అభ్యర్థించారు.
గత ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు తాము డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా తాము పని చేశామని రానున్న ఎన్నికల్లో ప్రజలు తమకు మరోసారి పట్టం కడతారని పేర్కొన్నారు.
అనంతరం రాణా ప్రతాప్ నగర్ శివాజీ నగర్ తదితర బస్తీల్లో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.